ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు

తాజా వార్తలు

Updated : 04/05/2020 09:01 IST

ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి: ఏపీలో ఇవాళ్టి నుంచి అదనపు రీటైల్‌ ఎక్సైజు ట్యాక్సు పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్లు, ఇతర మద్యం ధరలు పెరగనున్నాయి. 180 ఎంఎల్‌ రూ.120 ఉండే వాటిపై రూ.10 నుంచి రూ. 240 వరకు పెంపు విధించారు. 180 ఎంఎల్‌ రూ.150 వరకు ఉండే మద్యంపై రూ.20 నుంచి రూ.480 వరకు పెంచారు. రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యంపై రూ.30నుంచి రూ.720 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లు 330 ఎంఎల్‌కు రూ.20 నుంచి 5లీటర్ల బాటిల్‌కు రూ.3000 పెంచారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ధర పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ అమ్మకాలు సాగుతాయి. బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్‌ లైసెన్సుతో నడిచే కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని