అలా అన్నందుకు.. బండ్ల గణేశ్‌కు పవన్‌ పంచ్‌!
close

తాజా వార్తలు

Published : 25/08/2020 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా అన్నందుకు.. బండ్ల గణేశ్‌కు పవన్‌ పంచ్‌!

హైదరాబాద్‌: ‘గబ్బర్‌ సింగ్‌’లో శ్రుతిహాసన్‌ను కథానాయికగా వద్దని తాను పవన్‌కల్యాణ్‌కు చెప్పినట్లు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు. పవన్‌ ‘ఎందుకు శ్రుతి వద్దు’ అని అడిగితే, ‘ఆ అమ్మాయికి అన్నీ ఫ్లాప్‌లే’ అన్నానని.. అప్పుడు ‘నువ్వేమైనా అన్నీ హిట్‌లే తీశావా?’ అంటూ పవన్‌ అనడంతో మారు మాట్లాడకుండా శ్రుతినే హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెప్పారు.

తాను సులభంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవగలనని చెప్పడం ఎన్నికల ప్రచారంలో భాగం మాత్రమేననన్నారు. ఆయన్ను కలిసే అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో చాలామందిలా తానూ కష్టాలు పడ్డానని, ఇక నుంచి వివాదాల జోలికి పోనన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గణేశ్‌ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆగస్టు 31న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని