
తాజా వార్తలు
వాట్సాప్‌లో పీఎన్ఆర్ స్టేటస్..ఎలానో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో కొద్ది నెలల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా తమ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలోఫై (Railofy) పేరుతో తీసుకొస్తున్న ఈ సేవల ద్వారా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ (PNR Status)తో పాటు ట్రైన్ లైవ్ స్టేటస్, ట్రైన్ దాటిన స్టేషన్, రాబోయే స్టేషన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా ట్రైన్ స్టేటస్ కోసం ప్రయాణికులు 139 నంబర్‌కి ఫోన్ చేయాలి లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుంటారు. మరి కొంత మంది థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు వాటి సేవల్లో అంతరాయం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దామా..
* ముందుగా మీ ఫోన్లో వాట్సాప్‌ను అప్డేట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ లో ‘+91-9881193322’ నంబర్ని రైలోఫై అని లేదా మీకు నచ్చిన ఏదైనా పేరుతో సేవ్ చేసుకోవాలి.
* వాట్సాప్ ఓపెన్ చేసి అందులో కాంటాక్ట్ లిస్ట్‌లో మీరు సేవ్ చేసిన నంబర్‌పై క్లిక్ చేస్తే ఛాట్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ట్రైన్ టికెట్ పిఎన్ఆర్ నంబర్ టైప్ చేస్తే మీరు వెళ్లాల్సిన ట్రైన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది.
ఐఆర్సీటీసీ వినియోగదారులు, రైల్వే ప్రయాణికులు ఎవరైనా ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు నుంచి 10 నుంచి 20 సార్లు రైలోఫై ద్వారా పీఎన్ఆర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఈ వాట్సాప్ సేవల ద్వారా తరచుగా ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చని రైలోఫై తెలిపింది. అంతేకాదు రైలులో ప్రయాణిస్తున్నపుడు కూడా రాబోయే స్టేషన్ గురించిన సమాచారం తెలుస్తుంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- కొవిడ్ టీకా అలజడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
