అల్లు శిరీష్‌ స్వదేశీ సవాల్‌
close

తాజా వార్తలు

Published : 17/08/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు శిరీష్‌ స్వదేశీ సవాల్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ ‘గో లోకల్‌.. బీ వోకల్‌’ పేరుతో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోంది. ఆయన తాజాగా దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌, రకుల్‌ ప్రీత్‌, అను ఇమ్మానుయేల్‌, రాశీ ఖన్నా, అల్లు స్నేహారెడ్డి, ఉపాసన కొణిదెల, సైనా నెహ్వాల్‌లకు సవాల్‌ విసిరారు. దేశీయ ఉత్పత్తులతో కూడిన బహుమతులను వీరందరికీ పంపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి భారతీయుడు వీలైనంత వరకు విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. మన దగ్గర ప్రత్యామ్నాయం లేకపోతేనే స్వదేశీయేతర ఉత్పత్తులకు మొగ్గుచూపాలి. మీరు వాడే దేశీయ వస్తువుల గురించి సగర్వంగా బయటకు చెప్పండి’’ అంటూ ఆయన వివరించారు. శిరీష్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని