
తాజా వార్తలు
డీజీపీని కలిసిన అమరావతి రైతులు, మహిళలు
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో వారు చర్చించారు. శాంతియుతంగానే ధర్నాలు చేస్తున్నామని సవాంగ్‌కు రైతులు వివరించారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
Tags :
జిల్లా వార్తలు