సీతారాం ఏచూరిని కలిసిన మహిళా రైతులు
close

తాజా వార్తలు

Updated : 21/09/2020 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీతారాం ఏచూరిని కలిసిన మహిళా రైతులు

దిల్లీ: అమరావతి మహిళా ఐకాస నేతలు, మహిళా రైతులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. రాజధాని అమరావతి అంశంతో పాటు, ఆందోళనచేస్తున్న మహిళలపై పోలీసుల దాడుల గురించి ఆయనకు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐకాస నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. 

మూడు రాజధానులు అనేవి వాస్తవంగా సాధ్యం కాదని ఏచూరి అన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా సాధ్యం కాని మూడు రాజధానుల విధానం ఇక్కడ అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిపై నిర్ణయం అయిపోయాక మళ్లీ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా పరిరక్షించాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన అన్నారు. అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మూడు రాజధానులంటూ మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు. అమరావతి మహిళలపై పోలీసుల దాడులు దారుణమని వ్యాఖ్యానించారు.

మాణికం ఠాగూర్‌ను కలిసి మహిళా ఐకాస నేతలు

అనంతరం ఎంపీ రఘురామకృష్ణరాజుతో కలిసి మహిళా ఐకాస నేతలు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, ఎంపీ మాణికం ఠాగూర్‌ను కలిశారు. అమరావతి రైతుల ఇబ్బందులు, త్యాగాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల ఇబ్బందులు బాధాకరమన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు. భూములు త్యాగాలు చేసిన రైతులను మోసం చేస్తున్నారన్నారు. అమరావతి రైతుల ఆందోళనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని మాణికం ఠాగూర్‌ హామీ ఇచ్చారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని