ట్రంప్‌.. భారత్‌ బాటలో నడవండి!
close

తాజా వార్తలు

Published : 16/07/2020 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌.. భారత్‌ బాటలో నడవండి!

టిక్‌టాక్‌ సహా చైనా యాప్‌లను నిషేధించాలి

అధ్యక్షుడికి అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల లేఖ

ఇంటర్నెట్‌డెస్క్‌: టిక్‌టాక్‌ సహా అనేక చైనీస్‌ యాప్‌లను నిషేధించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖరాశారు. కఠిన నిర్ణయాలు తీసుకొని భారత్‌ చూపిన బాటలో నడవాలని సూచించారు. అమెరికన్‌ పౌరుల సమాచారం బయటకు పోకుండా, వారి గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జులై 15వ తేదీతో 25 మంది మహిళలు, పురుష సభ్యులు ట్రంప్‌కు రాసిన లేఖపై సంతకాలు చేశారు. దేశ భద్రతా కోణంలో టిక్‌టాక్‌ సహా చైనాతో అనుబంధం ఉన్న అనేక యాప్‌లు, సామాజిక మాధ్యమ వేదికలను నిషేధించాలని కోరారు. భారత వినియోగదారులే కాకుండా అనేక దేశాల యూజర్ల సమాచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థీకృతంగా తస్కరిస్తోందని పేర్కొన్నారు.

‘అమెరికా పౌరుల స్వేచ్ఛ, భద్రత, సమాచార గోప్యతను కాపాడాలంటే టిక్‌టాక్‌ సహా చైనా అనుబంధ సామాజిక మాధ్యమాలు, యాప్‌లను విశ్వసించకూడదు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థీకృత గూఢచర్యాన్ని అడ్డుకోవాలి. జాతీయ భద్రతకు విఘాతం కలగకుండా కాపాడాలి. యూఎస్‌ విపణిలోని అనేక చైనా యాప్‌లను నిషేధించేందుకు మేం మద్దతు ఇస్తాం’ అని లేఖలో సభ్యులు పేర్కొన్నారు. కాగా టిక్‌టాక్‌, హెలో సహా 59 చైనా యాప్‌లను కొన్నాళ్ల క్రితం భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని