భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది: ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 05/07/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘భారత్‌ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుంటుంది’ అంటూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేశారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం మోదీ.. ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు అమెరికా ప్రజలకు 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మీరు అందిపుచ్చుకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మేం ఎప్పుడూ ఆదరిస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ తాజాగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. భారత్‌పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని