close

తాజా వార్తలు

Published : 24/05/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లి కోసం ఆమె 80 కిలోమీటర్లు నడుచుకుంటూ..

కాన్పూర్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే  పెళ్లి రెండుసార్లు వాయిదాపడటం, మరోసారి కూడా వాయిదా పడే అవకాశాలు ఉండటంతో ఆ పెళ్లికూతురు ఇక నిరీక్షించకూడదనుకుంది. అనుకున్నదే తడవుగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెళ్లికొడుకు ఇంటికి నడస్తూ వెళ్లింది. అనూహ్యమైన ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని లక్షణ్‌తిలక్‌ గ్రామానికి చెందిన గోల్డీ అనే యువతికి బైసాపూర్‌కు చెందిన వీరేంద్రకుమార్‌ రాథోడ్‌తో వివాహ నిమిత్తం నిశ్చితార్థం అయ్యింది. అయితే దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించగా ఏప్రిల్‌లో జరగాల్సిన పెళ్లిని మే నెల 4కు వాయిదా వేశారు. అప్పుడు కూడా కుదరకపోవడంతో మరో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిద్దామని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే కొద్దిరోజుల క్రితం పెళ్లికుమార్తె గోల్డీ తమకు వెంటనే పెళ్లి జరిపించాలని, శుభముహుర్తాలు కోసం వేచి చూడొద్దని తండ్రితో వాదించింది. ఆమె తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో అసహనానకి గురైన గోల్డీ నడక మార్గాన ఉదయం బయలుదేరి పెళ్లికుమారుడి ఇంటికి చేరుకుంది. ఆమె రాకను గమనించిన పెళ్లికొడకు, అతని తండ్రి విషయం తెలుసుకుని షాక్‌ తిన్నారు. వెంటనే ఆమె తండ్రికి ఈ విషయం గురించి సమాచారం అందించారు. కుమార్తె కనిపించకపోవడంతో ఊరంతా గాలిస్తున్న పెళ్లికూతురి తండ్రి ఈ విషయం తెలిసి కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. బాజాబజంత్రీలు, ఆచారాలన్నీ పాటించి వివాహం జరిపిస్తామని పెద్దలందరూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, అవన్నీ కుదరవంటూ వెంటనే పెళ్లి చేయాలని పెళ్లికొడుకు ఇంటిముందే తిష్ఠ వేసింది. ఇక చేసేదేమి లేక పెళ్లి ఏర్పాట్లు చకచకా చేసి వారిద్దరిని ఒకటి చేశారు. ఈ విషయమై మీడియా ఆ జిల్లా ఎస్పీ అమరేంద్రసింగ్‌ను సంప్రదించగా పెళ్లి జరిగిన మాట నిజమేనని, ఆ విషయం తమకూ తెలుసునని వివరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన