యూపీలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరు మృతి
close

తాజా వార్తలు

Published : 24/12/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరు మృతి

అలహాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్‌పుర్‌లో ఉన్న ‘ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌’(ఇఫ్కో)లో అమ్మోనియా వాయువు లీక్‌ అయ్యింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో వెంటనే ఫూల్‌పుర్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇఫ్కో అధికార ప్రతినిధి కథనం ప్రకారం.. ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంటనే గుర్తించిన అధికారులు గ్యాస్‌ లీక్‌ను ఆపి పెను ప్రమాదాన్ని నియంత్రించారు. పీఎఫ్‌-1 యూనిట్‌లో గ్యాస్‌ లీక్‌ అవుతుందని గుర్తించిన వీపీ సింగ్‌ అనే అధికారి దాన్ని నిలువరించేందుకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే భారీ ఎత్తున గ్యాస్‌ లీక్‌కావడంతో దాన్ని పీల్చుకున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీన్ని గమనించిన మరో అధికారి ఆయన్ని రక్షించేందుకు వెళ్లారు. ఆయన కూడా గ్యాస్‌ బారిన పడి స్పృహ తప్పారు. విషయం తెలుసుకొని మిగతా సిబ్బంది వచ్చే సరికి వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని