close

తాజా వార్తలు

పాముకాటు ప్రమాదాలకో యాప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం భారత్‌లో ప్రతి సంవత్సరం ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు పాముకాటుకు గురౌతున్నారు. వారిలో 46,900 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి దుర్ఘటనలను నిరోధించే దిశగా జువాలజిస్ట్‌ వివేక్‌ శర్మ, వైల్డ్‌లైఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే జోస్‌ లూయిస్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఇండియా స్నేక్స్‌ అనే యాప్‌ను ప్రారంభించారు. దీనిని గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

పాముకాటు వంటి విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగించి బయటపడటానికి దీనిని రూపొందించినట్టు వారు తెలిపారు. ‘‘ఇండియా స్నేక్స్‌ యాప్ను పాములకు సంబంధించి ఒక ఆల్‌-ఇన్‌-వన్‌ అని చెప్పవచ్చు. దీనిలో పాము కరిచినప్పుడు స్పందించాల్సిన శాస్త్రీయ విధానం, మీ సమీపంలోని విష నిరోధక (ఆంటీ వీనమ్) మందులను కలిగి ఉన్న ఆసుపత్రుల వివరాలు, ప్రథమ చికిత్స వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. ఇంకా దీనిలో మీ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సరీసృప నిపుణుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో ‘స్నేక్‌ రెస్కూయర్స్‌’ విభాగంలో 202 మంది సుశిక్షిత నిపుణులు.. సమాచారం ఇవ్వడానికి సిద్ఢంగా ఉంటారు. అంతేకాకుండా దీని ద్వారా పాములలో వివిధ రకాలను గురించి సమాచారం తెలుసుకోవచ్చు’’ అని వారు తెలిపారు. ప్రజలు విపత్కర పరిస్థితులలో తమ సమీపంలోని డాక్టర్లను సంప్రదించటానికి, మరింత త్వరగా, సమర్థంగా అపాయాన్ని ఎదుర్కోవడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు.

ఇటీవల కేరళలో షహేలా షెరిన్‌ అనే బాలికను పాము కరిచిందని తోటి విద్యార్ధులు చెప్పినా, ఉపాధ్యాయురాలు సకాలంలో స్పందించక పోవటంతో పరిస్థితి విషమించింది. అనంతరం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రజలలో మరికొంత అవగాహన, సానుభూతి ఉండి ఉంటే ఇటువంటి దుర్ఘటనలు జరగవని లూయిస్‌ అభిప్రాయపడ్డారు.  వీరు 2016లో indiasnakes.org అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి, పాముల విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అసుపత్రులలో విషనిరోధక ఔషధాలను నిల్వ ఉంచేలా ప్రోత్సహించడమే తమ ప్రస్తుత కర్తవ్యమని వారు అంటున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.