
తాజా వార్తలు
పంజాబీ పాటకు ఆనంద్ మహీంద్రా ఫిదా..
ఇంటర్నెట్ డెస్క్: మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఓ పంజాబీ పాటకు ఫిదా అయ్యారు. ‘కాన్ కర్ గాల్ సన్’అనే పంజాబీ పాట వీడియోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఆయన ప్రశంసలు తెలిపారు. ‘నేను పంజాబీ సాధరణంగా పంజాబీ పాటను ఇష్టపడతాను, ప్రశంసిస్తాను. కానీ గాయకులు మనవగీత్ గిల్, సిమ్రాన్ కౌర్ ఆలకించిన ఈ పాటలో ఎంతో మాధుర్యం ఉంది. యువ గాయకురాలి స్వరంలో వినడంతో కొన్ని వాట్ల శక్తి వస్తుంది. మీ మెదడు, మనస్సుకు ప్రశాంతత కలిగి పునరుత్పాదక శక్తి అందుతుంది’ అని మహీంద్ర ట్వీట్ చేశారు. చాలా మంది నెటిజన్లు ఆయన ట్వీట్‌కు స్పందించారు. ఈ వీడియోను మొత్తంగా 3 వేల మందికి పైగా లైక్ చేశారు. ఒక లక్షకుపైగా వీక్షణలు వచ్చాయి. ఆయన ప్రశంసలకు గాయని సిమ్రాన్ కౌర్ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘మీకు ఆ పాట ఇంతగా నచ్చినందుకు ధన్యవాదాలు సార్’అని ట్వీట్ చేశారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- అందరివాడిని
- సాహో భారత్!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
