close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 24/05/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేను సింగిల్‌ పీస్‌: అనసూయ

ఇటలీలో ఉండాలనుకున్నాం

హైదరాబాద్‌: ‘నేను సింగిల్‌ పీస్‌’ అని అంటున్నారు బుల్లితెర యాంకర్‌ అనసూయ. లాక్‌డౌన్‌ వల్ల ఇంటిపనుల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘బోర్‌గా‌ ఫీల్‌ అవుతున్నాను. మీ ప్రశ్నలు, ప్రేమాభిమానాలతో నన్ను ఉత్తేజపరచండి’ అని పేర్కొంటూ నెటిజన్లతో ఛాట్‌ చేశారు. షూటింగ్స్‌ను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని తెలిపారు. పవన్‌ సినిమా, క్వారంటైన్‌ లైఫ్‌స్టైల్‌, వర్కౌట్లు, వివాహ వార్షికోత్సవ ప్రణాళికల‌ గురించి ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

నాలాంటి ఎందరో అమ్మాయిలకు మీరు స్ఫూర్తి. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర మహిళగా ఎలా ఉండగలుగుతున్నారు?

అనసూయ: థ్యాంక్యూ!! విలువల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం. ఆవిషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

లాక్‌డౌన్‌ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏమైనా సలహాలు ఇవ్వగలరు?

అనసూయ: ఆ విషయంలో నాకే ఐడియాల కొరత ఏర్పడింది. అందుకే ఈ చిట్‌ఛాట్‌. మీకు ఏమైనా ఆలోచనలు వస్తే నాకు చెప్పగలరు.

ప్రశ్న: మేడమ్‌ పవర్‌స్టార్‌ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? మీ యాక్టింగ్‌ చాలా బాగుంటుంది.

అనసూయ: థ్యాంక్యూ.. నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..

మీ భర్తే మీ ఫస్ట్‌ బాయ్‌ఫ్రెండ్‌.. అని పేర్కొంటూ ఓ అభిమాని అనసూయ దంపతుల ఫొటోని షేర్‌ చేయగా..

అనసూయ: నా ఫస్ట్‌, 2, 3.. ఇప్పటికీ, అలాగే భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌. 

మేడమ్‌.. మీ వివాహ వార్షికోత్సవ ప్లాన్స్‌ ఏమిటి..?

అనసూయ: ఇది మా పదో వార్షికోత్సవం. ఈ ఏడాది మేము ఇటలీలో జరుపుకోవాలని ఆశించాం. ఎన్నో అనుకున్నాం. కానీ ఇప్పుడు అవేమీ చేయలేం.

మీలాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి..?

అనసూయ: అది కొంచెం కష్టం.. ఎందుకంటే నేను సింగిల్‌ పీస్‌!! మంచి అమ్మాయి, కొంచెం నాలాంటి అమ్మాయి రావాలని ఆశిస్తున్నాను.

ప్రశ్న: మేకప్‌ లేకుండా కూడా అమ్మాయిలు అందంగా ఉంటారని మీరు నిరూపించారు?

అనసూయ: అది నిజమే అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు

ప్రశ్న: ఏమైనా డైట్‌ టిప్స్‌ ఇవ్వగలరు.. లాక్‌డౌన్‌ వల్ల నేను బరువు పెరుగుతున్నాను.

అనసూయ: 3.5 కిలోల బరువు పెరిగాను. మరి నేను ఎవరితో చెప్పుకోవాలి.

ప్రశ్న: లాక్‌డౌన్‌ తర్వాత ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?

అనసూయ: తిరుమల వెళ్లాలని ఉంది

ప్రశ్న: మీరు కుకింగ్‌ ఛానల్‌ ప్రారంభించండి?

అనసూయ: నా వృత్తిపరమైన జీవితం ప్రారంభమైతే నాకు అంత సమయం దొరకదు. ఇప్పుడంటే కిచెన్‌లో అదే పనిగా ఉంటున్నాను కాబట్టి ఏదో అలా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నా.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.