close

తాజా వార్తలు

Updated : 20/11/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సలాం కుటుంబసభ్యులకు సీఎం జగన్‌ పరామర్శ

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు వచ్చిన సీఎం జగన్‌ ఏపీఎస్పీ అతిథి గృహం వద్ద సలాం కుటుంబసభ్యలను కలిశారు. సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు శంషావళీ, కుమార్తె సాజిదాను సీఎం ఓదార్చారు. తన కుమార్తె సాజిదాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జగన్‌ను సలాం అత్త మాబున్నీసా ఈ కోరారు. వైద్యశాఖలో పనిచేస్తున్న తన అల్లుడిని నంద్యాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సలాం కుటుంబానికి అండగా ఉంటామని.. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. మాబున్నీసా కుమార్తెకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇవ్వాలని.. అల్లుడు శంషావళిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలి  చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ఆదేశించారు.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని