ఏపీలో మరో మూడు పాజిటివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 17:06 IST

ఏపీలో మరో మూడు పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఏపీలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 135కి చేరింది. ఉదయం 9 గంటల తర్వాత ఈ మూడు కేసులు నమోదైనట్లు శ్రీకాంత్‌ తెలిపారు. అయితే ఏయే జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

నిన్నటి వరకు 111 పాజిటివ్‌ కేసులు ఉండగా.. వైద్యఆరోగ్యశాఖ ఈ ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. దాంతో పాజిటివ్‌ కేసులు 132కి చేరుకోగా.. తాజాగా 3 కేసులతో ఆ సంఖ్య 135కి చేరుకుంది. దీంతో ఈ ఒక్కరోజే ఇప్పటి వరకు 24 కేసులు నమోదయినట్లయింది. సుమారు మరో 490 మందికి సంబంధించిన పరీక్షల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని