టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో మరో దిగ్గజ సంస్థ!
close

తాజా వార్తలు

Updated : 28/08/2020 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో మరో దిగ్గజ సంస్థ!

న్యూయార్క్‌: భారత్‌లో నిషేధానికి గురై తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని వాల్‌మార్ట్‌ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్‌ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్‌ ప్రకటనపై ఇటు మైక్రోసాఫ్ట్‌ కానీ, టిక్‌టాక్ కానీ  స్పందించలేదు. టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అధ్యక్షుడు ట్రంప్‌ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో కార్యకలాపాల్ని విక్రయించాలని.. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అందుకు సెప్టెంబరు 15 గడువుగా విధించారు. 

మరోవైపు టిక్‌టాక్‌ కార్యకలాపాలపై భారత్, అమెరికా లేవనెత్తున్న అభ్యంతరాల్ని పరిష్కరించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఛైర్మన్‌ ఝాంగ్‌ యిమింగ్‌ ప్రకటించారు. వినియోగదారులు, భాగస్వాములు, ఉద్యోగుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని యాప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని