close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 27/05/2020 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రయోగ దశలో మరో కొత్త టీకా

ఆస్ట్రేలియాలో చేపట్టిన అమెరికా సంస్థ

క్యాన్‌బెర్రా: కరోనా వైరస్‌ కట్టడి కోసం రూపొందించిన ఒక కొత్త టీకాను ఆస్ట్రేలియాలో పరీక్షిస్తున్నట్లు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ నోవావ్యాక్స్‌ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లోగా దీనిపై ప్రయోగాలను పూర్తిచేసి, విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 అనే ఈ ప్రయోగాత్మక టీకాను మొదటి దశలో భాగంగా 131 మందికి ఇస్తామని నోవావ్యాక్స్‌ పరిశోధన విభాగం అధిపతి గ్రెగోరి గ్లెన్‌ చెప్పారు. మంగళవారం ఆరుగురు పరీక్షార్థులకు దీన్ని ఇచ్చామన్నారు. ఈ వ్యాక్సిన్‌ సురక్షితమేనా, సమర్థంగా పనిచేస్తోందా అన్నది పరిశీలించనున్నట్లు వివరించారు. కొవిడ్‌-19 నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు డజను టీకాలు ప్రయోగాల దశలో ఉన్నాయి. అయితే అందులో ఎన్ని అంతిమంగా ఫలప్రదమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టీకాలు చాలా వరకూ విభిన్న పరిజ్ఞానాలతో సిద్ధమవుతున్నాయి. టీకా అభివృద్ధికి సమాంతరంగా వాటి డోసులనూ నోవావ్యాక్స్‌ రూపొందిస్తోందని గ్లెన్‌ చెప్పారు. తక్కువ డోసుల్లో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు జంతువులపై జరిగిన పరిశోధనల్లో తేలిందన్నారు. ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల డోసులను, వచ్చే ఏడాది 150 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.