
తాజా వార్తలు
‘సర్కారువారి పాట’లో అనుష్క.. నిజమెంత?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నది దాని సారాంశం. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చివరికి తేలిందేంటంటే.. ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదట.
ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి ట్విటర్లో డైరెక్టర్ పరుశురామ్ పేరుతో ఖాతా తెరిచారు. ‘‘సర్కారువారి పాట’లో అనుష్క ఓ పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో అదరగొడుతుందన్న నమ్మకం ఉంది. షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని అందులో పోస్టు చేశాడు. తీరా అది నకిలీ ఖాతా అని తెలిసే సరికి ఈ వార్త కూడా నకిలీదేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
