యాపిల్‌ కొత్త ఈవెంట్‌..ఏం రాబోతున్నాయంటే?
close

తాజా వార్తలు

Updated : 08/10/2020 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాపిల్‌ కొత్త ఈవెంట్‌..ఏం రాబోతున్నాయంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: గత నెలలో కొత్త ప్రొడక్ట్‌ విడుదల కోసం యాపిల్ ఓ ఆన్‌లైన్ ఈవెంట్ నిర్వహించింది. అందులో కొత్త యాపిల్ వాచ్‌, ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌, ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ ట్యాగ్స్‌ వంటి వాటిని విడుదల చేసింది. అయితే ఐఫోన్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 విడుదలను వాయిదా వేస్తూ అందరినీ ఆర్చర్యానికి గురిచేసింది. తాజాగా ఐఫోన్ 12ను అక్టోబరు 13న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ హై- స్పీడ్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో ఏం లాంచ్‌ చేయబోతున్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే హై, స్పీడ్ పదాలు ఐఫోన్‌ 12 లోని హై-స్పీడ్ 5జీ కనెక్టివిటీకి సంకేతాలుగా భావించొచ్చని టెక్‌ వర్గాల అభిప్రాయపడుతున్నాయి.

ఈ సారి ఐఫోన్‌ 12 సిరీస్‌లో నాలుగు ఫోన్లను విడుదల చేయనుందట. అవి ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ మోడల్స్‌. ఐఫోన్ 12 మినీ 5.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో 64జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా తీసుకొస్తున్నారని సమాచారం. దీని ధర 649 డాలర్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో రూ.47,600. ఇక ఐఫోన్ 12లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 64జీబీ మెమరీ ధర 749 డాలర్ల నుంచి 899 డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 55,000 నుంచి రూ. 66,000. ఐఫోన్ 12 ప్రోలో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో ఇస్తున్నారట. ఈ మోడల్‌ 128 జీబీ, 512 జీబీ అంతర్గత స్టోరేజీ ధర 999 డాలర్లు, 1299 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. మన కరెన్సీలో రూ. 74 వేలు, రూ. 96 వేలు.

12 సిరీస్‌లోనే ప్రీమియం మోడల్‌గా ఐఫోన్‌ 12 ప్రో మాక్స్‌ను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ధర 1099 డాలర్ల నుంచి 1,399 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. మన కరెన్సీలో సుమారు రూ. 81 వేల నుంచి లక్ష రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్ 12లో డ్యూయల్‌ కెమెరా, ఐఫోన్‌ 12 ప్రో మోడల్స్‌లో ట్రిపుల్ కెమెరాలను ఇస్తున్నారట. అలానే ఐఫోన్‌ 12 సిరీస్‌లో యాపిల్ ఏ14 బయోనిక్‌ చిప్ ఉపయోగించారని సమాచారం. ఈ ఫోన్లను సంబంధించి మిగిలిన వివరాలు తెలియాలంటే అక్టోబరు 13 వరకు వేచి చూడాల్సిందే!!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని