వాడకంలో వంద కోట్ల యాపిల్‌ ఫోన్లు
close

తాజా వార్తలు

Published : 29/10/2020 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాడకంలో వంద కోట్ల యాపిల్‌ ఫోన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా వాడకంలో ఉన్న ఐఫోన్ల సంఖ్య ఒక బిలియన్‌ మార్కుకు చేరుకుందని ఓ తాజా పరిశీలనలో తేలింది. సాంకేతిక దిగ్గజం యాపిల్‌ను పరిశీలించి, విశ్లేషించే ‘ఎబౌ యావ్లాన్‌’ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనితో అత్యంత ప్రజాదరణ పొంది, అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌గా యాపిల్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాగా, ఈ మైలురాయిని చేరుకునేందుకు యాపిల్‌కు 13 ఏళ్లు పట్టిందని ఆ సంస్థ తెలిపింది. యాపిల్‌ తన తొలి ఫోన్‌ను 2007లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పోటీదారులకు యాపిల్‌ను అనుకరిచటం లేదా దాని ప్రేరణతో ఫోన్లను తయారుచేయటం తప్ప వేరే దారి లేదని నిపుణులు అంటున్నారు.

బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌

తమ అంచనా ప్రకారం 2021 సంవత్సరం చివరి త్రైమాసికంలో 250 మిలియన్ల ఐఫోన్‌ అమ్మకాలు జరుగుతాయని ఎబౌ యావ్లాన్‌ అంటోంది. కాగా యాపిల్‌ ప్రస్తుత త్రైమాసిక విక్రయాలు 200 మిలియన్లుగా ఉన్నాయి. 2015లో అమ్మకాలు అత్యున్నత స్థాయికి చేరుకున్న నేపథ్యంలో యాపిల్‌ ఓ సమయోచిత నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులకు  ఐఫోన్‌ సర్వీసులను మరింతగా అందుబాటులోకి తేవడంపై  దృష్టి కేంద్రీకరించాలనే ఈ నిర్ణయం.. సదరు ఫోను గిరాకీ పెరుగుదలకు ఇతోధికంగా తోడ్పడిందని వారు అంటున్నారు.
ఇదిలా ఉండగా తొలిసారి యాపిల్‌ ఫోన్లను కొనేవారి సంఖ్య కంటే.. తమ ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని ఈ సంస్థ పరిశీలనలో తేలింది. కానీ 2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త వినియోగదారుల సంఖ్య 20 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇది సంస్థ చరిత్రలోనే అతి తక్కువని ఎబౌ యావ్లాన్‌ అంటోంది. ఇందుకు కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ ఓ కారణం కాగా.. యాపిల్‌ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యుత్తమ స్థాయిని చేరుకుందని, ఈ తగ్గుదలకు అదే కారణం కావచ్చని ఆ సంస్థ విశ్లేషిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని