close

తాజా వార్తలు

Published : 23/03/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో ఆరామ్‌కో మరిన్ని పెట్టుబడులు!

 

దిల్లీ: ముడిచమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాలైన భారత్‌ వంటి దేశాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా దిగ్గజం ఆరామ్‌కో తెలిపింది. ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 20 శాతం వరకు వాటా కొనుగోలుకు సంస్థ సంప్రదింపులు జరుపుతున్న సంగతి విదితమే. ప్రపంచంలో చమురు అధికంగా వినియోగించే దేశాల్లో ఒకటైన భారత్‌ అవసరాలు ఏటా 4-5 శాతం పెరుగుతున్నాయి కూడా. 83 శాతం చమురు అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశానికి రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా ఉంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని