
తాజా వార్తలు
వైరల్‌గా మారిన అర్హ బర్త్‌డే ఫొటోలు
మైత్రిమూవీ మేకర్స్ స్పెషల్ పార్టీ
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అర్హ పుట్టినరోజు శనివారం వేడుకగా జరిగింది. బర్త్‌డేని పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ సంస్థ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సుకుమార్, మైత్రిమూవీ మేకర్స్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా బన్నీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘అర్హ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటిల్లిపాదికి గుర్తుండిపోయే పార్టీని ఏర్పాటు చేసిన మైత్రిమూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. ముఖ్యంగా రవి, నవీన్, చెర్రీలకు నేను వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెబుతున్నాను.’ అని బన్నీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.