అనుమానాస్పద స్థితిలో సైనికాధికారి మృతి 
close

తాజా వార్తలు

Published : 09/11/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుమానాస్పద స్థితిలో సైనికాధికారి మృతి 

జమ్ము: జమ్ము కశ్మీర్‌లో మేజర్‌ ర్యాంక్‌ సైనికాధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్‌ క్యాంప్‌ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకొంది. థానమండి ప్రాంతంలోని ఆర్‌ఆర్‌ క్యాంప్‌లో మేజర్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఈ విషయాన్ని సీనియర్‌ ఆర్మీ అధికారులు, పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మరో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కూడా మొదలైంది.

మృతుడిని మేజర్‌ వినీత్‌ గులియాగా గుర్తించారు. ఆయనది హరియాణా రాష్ట్రం. 38 ఆర్‌ఆర్‌ డేరాకి గలీ విభాగానికి కంపెనీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.  ‘‘మృతుడి తలపై తూటా గాయం ఉన్నట్లు మా బృందం గుర్తించింది. సెక్షన్‌ 174 సీఆర్ పీసీ కింద దర్యాప్తు చేపట్టాం’’ అని రాజౌరీ జిల్లా ఎస్‌ఎస్‌పీ చందన్‌ కోహ్లీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని