close

తాజా వార్తలు

సుప్రీంకోర్టులో అసదుద్దీన్‌ పిటిషన్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరుతూ శనివారం ఓ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు.

అంతకుముందు పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రతిపాదిత బిల్లును అసదుద్దీన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రతిని కూడా చింపివేశారు. ముస్లింలను దేశంలో లేకుండా చేయాలనేదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా ఉందని ఆరోపించారు. దేశం మరోసారి విభజనకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. పొరుగు దేశాల (పాకిస్థాన్‌, ఆఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌) నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అసోంలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.