close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/06/2020 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజలందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి

దిల్లీ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ డిమాండ్‌

దిల్లీ: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష అందరి హక్కు అని... దానిని ప్రతి ఒక్కరికీ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌-19 కారణంగా నానాటికి దిగజారుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ తరపున కాంగ్రెస్‌ పార్టీ దిల్లీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్ పాల్గొన్నారు. ప్రతి కరోనా బాధితుడి కుటుంబానికి, కంటైన్‌మెంట్‌లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రూ.10,000 చొప్పున అందచేయాలని ఆయన సూచించారు. వైద్య విద్య నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను తాత్కాలిక వైద్యులుగా ఉపయోగించవచ్చని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సూచించింది. కొవిడ్‌-19 కష్టకాలంలో పాఠశాల, కళాశాల హాస్టల్‌ భవనాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడవచ్చని ఆ పార్టీ సలహా ఇచ్చింది.

కొవిడ్‌ పరీక్షలకయ్యే ఖర్చులో 50 శాతాన్ని మాఫీ చేయాలని భాజపా దిల్లీ అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌ గుప్తా కోరగా... అందుకు అమిత్‌ షా అంగీకరించారు. జూన్‌ 20 నుంచి రాజధానిలో రోజుకు 18,000 కరోనా పరీక్షలు నిర్వహిస్తామని షా ప్రకటించారు. కేవలం రూ.450 స్వల్పమొత్తంతో సాధ్యమయ్యే కరోనా పరీక్షలు దిల్లీలో త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ వివరించారు. ఇక ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్, అమిత్‌ షాతో సమావేశం చాలా ఉపయుక్తమైందని... కరోనాకు సంబంధించిన విషయాలపై అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దీని ద్వారా వీలు కలిగిందన్నారు. అయితే లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించాలని ఏ పార్టీ సూచించకపోవటం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.