close

తాజా వార్తలు

Published : 30/11/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి తాపీతో దాడికి యత్నించాడు. ఆదివారం ఉదయం మంత్రి తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మంత్రి నానికి తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే మంత్రి గన్‌మెన్‌, అనుచరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

నిందితుడు మచిలీపట్నంకు చెందిన తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి నానిపై తాపీమేస్త్రి రెండు సార్లు దాడికి యత్నించినట్టు  మంత్రి అనుచరులు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేమీ కాలేదని పేర్ని నాని  తెలిపారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన