close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120001840 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => HWo5y97YCcE [video_short_link] => HWo5y97YCcE [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-01-04 12:22:03.217327 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఆస్ట్రేలియ ప్రధాని భారత పర్యటన రద్దు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడి ప్రధాని కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఆయన జనవరి 13 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు మోరిసన్‌ కార్యాలయంం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు వాయిదా పడ్డట్లైంది.

అంతకుముందు స్కాట్‌ మోరిసన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకొని మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. భారత్‌ తరఫున ఎలాంటి సహాయసహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా తీర ప్రాంత అడవుల్లో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంటల్ని ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.