close

తాజా వార్తలు

Published : 11/07/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ధన్వంతరి రథ్‌’ అమలు చేయాలి..ప్రధాని

కరోనా వైరస్‌ కట్టడి, సన్నద్ధతపై ప్రధాని సమీక్ష

దిల్లీ: కొవిడ్‌-19 కట్టడి, సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సమీక్షించారు. కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులను ప్రశంసించారు. అహ్మదాబాద్‌లో విజయవంతమైన ‘ధన్వంతరి రథ్‌’ కార్యక్రమాన్ని అంతటా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితిపై మోదీ సమీక్షించారు. రాష్ట్రాల సన్నద్ధత ఎలా ఉందో తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక ప్రవర్తన బాగుండాలని సూచించారు. ‘కొవిడ్‌పై అవగాహనను విస్తృతం చేయాలి. ఎవరికీ వైరస్‌ సంక్రమించకుండా కఠిన చర్యలు కొనసాగించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యానికి అస్సలు తావులేదు’ అని ఆయన అన్నారు. దిల్లీలో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర, స్థానిక వర్గాలను ప్రధాని ప్రశంసించారు. ఎన్‌సీఆర్‌ ప్రాంతమంతా ఇదే విధానం అమలు చేయాలని సూచించారు.

అహ్మదాబాద్‌లో ఇంటి వద్దనే బాధితులను పర్యవేక్షించడం, వైద్యం అందించే ‘ధన్వంతరి రథ్‌’ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేయాలన్నారు. అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు మోదీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వైద్యారోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్‌, నీతి ఆయోగ్‌ సభ్యులు, కేబినెట్‌ కార్యదర్శి సహా ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని