close

తాజా వార్తలు

అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తి

గుంటూరు: ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది.  సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో నాలుగు గంటల పాటు రీపోస్టుమార్టం జరిగింది. ఫోరెన్సిక్‌ బృందం ఆయేషా పుర్రె,, ఆస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించి వాటిని పరిశీలించింది. ఆయేషా ఎముకల నుంచి కూడా పలు అవశేషాలను సేకరించింది. మృతదేహాన్ని వెలికితీయగా లభించిన అవశేషాలను ఓ బాక్స్‌లో ఉంచి సీలు చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. రీపోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ బృందం పూర్తి నివేదికను సీబీఐకి అప్పగించనుంది. ఫోరెన్సిక్‌ బృందం అందించే ఆధారాల మేరకు సీబీఐ అధికారులు విచారణ జరపనున్నారు. పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో తెనాలి సబ్‌కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌, తహసీల్దార్‌ రవిబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

2007 డిసెంబర్‌ 27న జరిగిన ఆయేషా మీరా హత్యోదంతం సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పట్లో నిందితుడుగా గుర్తించి సత్యంబాబును 2008 ఆగస్టు 11న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ మహిళా సెషన్స్‌ ప్రత్యేక న్యాయస్థానం 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అనంతరం 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తేల్చుతూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష తర్వాత సత్యంబాబు విడుదలయ్యారు. మరోవైపు 2018 నవంబర్‌ 29న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 2019 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభమైంది. సీబీఐ విచారణలో భాగంగా ఇవాళ ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు.

గాంధీ ఆస్పత్రికి ఆధారాలు..
‘ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్‌ బృందం పలు అవశేషాలు సేకరించింది. వాటిని భద్రత నడుమ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించింది’ అని తెనాలి తహసీల్దార్‌ రవిబాబు తెలిపారు.

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.