
తాజా వార్తలు
సచిన్ పైలట్‌కు భాజపా స్వాగతం..!
దిల్లీ: రాజస్థాన్‌లో తాజా పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. ఈ సమయంలో సచిన్ పైలట్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మథూర్ ప్రకటించారు. అంతేకాకుండా భాజపా విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చని ఆయన స్పష్టంచేశారు.
అయితే ముఖ్యమంత్రి గహ్లోత్ తనకు సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా తన మెజారిటీని నిరూపించుకోవాలని మథూర్ సూచించారు. రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమయంలో భాజపా బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు భాజపాలో చేరనంటూ చెబుతున్న సచిన్ పైలట్, కాంగ్రెస్ పార్టీ తాజా చర్యలపై స్పందించాల్సి ఉంది.
Tags :