close

తాజా వార్తలు

Published : 15/01/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజధాని మారిస్తే ‘న్యాయ’ చిక్కులు: సుజనా

సీఎం జగన్‌కు 10 పేజీల లేఖ రాసిన భాజపా ఎంపీ

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనను అమలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.4లక్షల కోట్లు అవసరమని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. సీఎం జగన్‌కు మంగళవారం ఆయన 10పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రాజధానిగా అమరావతి ఎంపిక, భూ సమీకరణ, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అక్కడ జరిగిన అభివృద్ధి, పూర్తిచేసిన నిర్మాణాలు, పనుల పురోగతి తదితర అంశాలతో పాటు రాజధాని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, దానివల్ల కలిగే నష్టాలను ఆ లేఖలో సుజనా వివరించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రూ.3వేల కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తిచేస్తే అమరావతి నుంచే పాలన సాగించేందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరతాయని పేర్కొన్నారు. నిధులు లేవనే సాకు చూపి రాజధాని మార్చటమనేది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సుజనాచౌదరి సూచించారు.

ఆ వ్యయం భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు

అమరావతి మార్పు అంశంపై రైతుల ఆందోళనల నేపథ్యంలో రాజధాని మార్చవద్దని సీఎంకు సుజనా సూచించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారన్నారు. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన, డిజైన్ల తయారీ, అమరావతి అభివృద్ధి వంటి అంశాలను లేఖలో ఆయన ప్రస్తావించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు నిలిపివేశారని.. దానికి కొనసాగింపుగా మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికిప్పుడు రాజధాని మార్చటం అంటే న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన అవస్థల్ని కొనితెచ్చుకోవడమేనని సుజనా హెచ్చరించారు. గత ప్రభుత్వంతో రైతులు, పెట్టుబడిదార్లు ఒప్పందం కుదుర్చుకున్నందున వాటిని నెరవేర్చకపోతే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. రాజధాని భూసమీకరణలో అక్రమాలు జరిగాయని భావిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజధానిని విశాఖ, కర్నూలుకు మార్చాలంటే రూ.లక్ష కోట్లు అవసరమని.. ఆ వ్యయం భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.