
తాజా వార్తలు
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్‌మెట్‌లో నిర్వహించిన రోడ్‌షోలో సంజయ్ పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యమని.. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందేందుకు డివిజన్‌కు కేసీఆర్ రూ.5కోట్లు పంపారని.. రూ.500 కోట్ల వరదసాయం తెరాస కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ తప్పకుండా చేస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి కోసం భాజపా పరితపిస్తోందన్నారు.
ఇవీ చదవండి..
కేంద్రం ప్యాకేజీ ఎవరికైనా అందిందా?: కేటీఆర్
కూకట్‌పల్లిలో యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షో