
తాజా వార్తలు
సమాచారముంటే.. చర్యలేవి: బండి సంజయ్
హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత మాజీ సీఎంలపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పీవీ జయంతి ఉత్సవాలు జరపడమే కాదు ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని తెరాసకు హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రల జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. దానిపై పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కనుమరుగు కాబోతోందని సంజయ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన వివరించారు.
Tags :
జిల్లా వార్తలు