Array
(
)
దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో భాజపాదే ఆధిక్యం..!
close

తాజా వార్తలు

Updated : 10/11/2020 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో భాజపాదే ఆధిక్యం..!

59స్థానాల్లో 40చోట్ల గెలుపు దిశగా కాషాయ పార్టీ

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 59 స్థానాల్లో దాదాపు 40కిపైగా సీట్లలో భాజపా విజయం వైపు దూసుకెళ్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో 21చోట్ల భాజపా గెలుపు దిశగా పయణిస్తోంది. ఇక గుజరాత్‌లోనూ జరిగిన 8 స్థానాలను భాజపా క్లీన్‌ స్వీప్‌ చేసే దిశగా వెలుతోంది. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఐదు స్థానాల్లో భాజపా ముందుంది. మరో రెండు స్థానాల్లో సమాజ్‌వాది పార్టీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

11 రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాల సరళి ఇలా ఉంది..

* ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్‌ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్‌ ఇక్కడ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

* గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లో భాజపా అన్నింటా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. భాజపా ఇప్పటివరకు 54శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

* హరియాణాలో ఒక స్థానానికి ఎన్నిక జరుగగా.. ఇక్కడ కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

* ఝార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

* కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో భాజపా ముందంజలో ఉంది. ఇక్కడ కూడా భాజపాకు భారీ ఆధిక్యం వచ్చే అవకాశాలున్నాయి.

* మధ్యప్రదేశ్‌లో 28స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 20సీట్లలో భాజపా విజయం దిశగా వెలుతోంది. మరో ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. వీటిలో ఎక్కువ సిట్టింగ్‌ సీట్లు కాంగ్రెస్‌వే కావడం గమనార్హం.

* మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పటికే మూడు స్థానాల్లో భాజపా, మరోస్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు. మరో స్థానంలో భాజపానే ముందంజలో ఉంది.

* నాగాలాండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి, మరోస్థానంలో ఎన్‌డీపీపీ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రెండు నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీలేవీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ బిజూ జనతాదళ్‌(బీజేడీ) భారీ ఆధిక్యంలో దూసుకెళుతోంది.

* తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ భాజపా విజయం సాధించింది. అయితే, భాజపా, తెరాస పార్టీల మధ్య చివరివరకూ హోరాహోరీ కొనసాగింది. చివరకు వెయ్యి ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.

*ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆరు స్థానాల్లో భాజపా, ఒకచోట ఎస్పీ ముందంజలో ఉన్నాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని