దిల్లీ అల్లర్లపై కేంద్రం చర్యలేవి?: ఏచూరి
close

తాజా వార్తలు

Published : 14/09/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ అల్లర్లపై కేంద్రం చర్యలేవి?: ఏచూరి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. దిల్లీ అల్లర్ల కేసులో సహ కుట్రదారుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన  కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుతోందని విమర్శించారు. దిల్లీ అల్లర్లుకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘ కేంద్ర ప్రభుత్వ చట్టవిరుద్ధమైన చర్యలకు భాజపా నాయకుల రాజకీయాలే కారణమని తేటతెల్లమవుతోంది. శాంతియుత నిరసనలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రాల అధికారాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. దిల్లీ పోలీసులు కూడా కేంద్రం ఆధీనంలోనే పని చేస్తున్నారు.’’ అని ఏచూరి విమర్శించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకే కాకుండా ప్రెస్‌మీట్లు నిర్వహించడానికి, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వాటికి సమాధానమివ్వడానికి కూడా కేంద్రం భయపడుతోందని ఆయన విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న రాజ్యంగ వ్యతిరేక చర్యలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీ, భాజపా నిజస్వరూపానికి తాజా చర్యలే నిదర్శనమని ఏచూరి వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఫిబ్రవరి 24న ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లోనూ వాడీ వేడిగా చర్చసాగింది. అల్లర్లతో సంబంధం ఉన్న ఏ మతం, కులం, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారినైనా వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని