close

తాజా వార్తలు

కేజ్రీవాల్‌పై భాజపా అభ్యర్థి ఎవరో తెలుసా..?

దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పోటీగా భాజపా తరఫున రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సునీల్‌ యాదవ్‌ను బరిలోకి దింపారు. నేటితో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగుస్తుండడంతో సోమవారం రాత్రి పది మందితో కూడిన తుది జాబితాను భాజపా విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంతో విభేదిస్తున్న శిరోమణి అకాళీదళ్‌ దిల్లీలో పొత్తు లేదని ప్రకటించడంతో భాజపా తుది జాబితా ఖరారు చేసింది. మరో మూడు సీట్లను మిత్రపక్షాలు జేడీయూ, ఎల్‌జేపీకి కేటాయించింది. 57 మందితో కూడిన తొలి జాబితాను జనవరి 17న విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో 20 మందికిపైగా కొత్తవారు ఉండడం విశేషం. 

దాదాపు రెండు దశాబ్దాల నుంచి దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న భాజపా.. ఈసారి అధికారపక్షం ఆమ్‌ ఆద్మీ పార్టీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో 67 స్థానాలతో జయభేరీ మోగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో గెలిచిన భాజపా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 8న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న తుది ఫలితాలు వెల్లడవుతాయి.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.