close

తాజా వార్తలు

Published : 28/07/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయిలో ఈరోజు 700 కేసులే..

మూడు నెలల తర్వాత అత్యల్పంగా నమోదు

ముంబయి: దేశ ఆర్థిక రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే పట్టు వీడినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలలుగా మహారాష్ట్రలో కోరలు చాచిన మహమ్మారి ఇటీవల తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ముంబయిలో కరోనా కేసులు విపరీతంగా తగ్గడమే అందుకు ఉదాహరణ. తాజాగా 8,776 మందికి పరీక్షలు నిర్వహించగా 700 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీఎంసీ కమిషనర్‌ సోమవారం వెల్లడించారు. ఆదివారం వెయ్యికిపైగా నమోదైన కేసులతో పోలిస్తే ఈ ఫలితాలు ఊరటనిస్తున్నాయని చెప్పారు. గత మూడు నెలల్లో ఈ రోజు వచ్చిన కేసులే అత్యల్పమని తెలిపారు. దీంతో ముంబయిలో ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు.

మరోవైపు అక్కడ రికవరీ రేటు కూడా పెరిగిందని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల పరంగా చూస్తే ధానే, పుణె నగరాల కన్నా ముంబయి మెరుగ్గా ఉందన్నారు. ఇక దేశంలో వైరస్‌ మొదలైన తొలినాళ్ల నుంచే మహారాష్ట్ర అత్యధిక కేసులతో తల్లడిల్లింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బీఎంసీ తొలుత ధారావి లాంటి మురికివాడపై శ్రద్ధ పెట్టింది. ఇప్పుడక్కడ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,47,896గా నమోదైంది. ఇప్పటివరకు 2,21,944 మంది కోలుకోగా, 13,883 మంది మరణించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని