
తాజా వార్తలు
మార్కెట్లోకి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ బీఎస్6 విడుదల
ముంబయి: ఫ్రాన్స్‌కు చెందిన కార్ల కంపెనీ రేనాల్ట్ భారతీయ మార్కెట్లోకి సరికొత్త క్విడ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే రెనాల్ట్ నుంచి భారత్ మార్కెట్లోకి వచ్చి విజయవంతమైన ఈ మోడల్లో ఆర్ఎక్స్ఎల్ బీఎస్6 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.16లక్షలుగా నిర్ణయించింది. ఈ ఆర్ఎక్స్ఎల్ మోడల్ 1.0లీటర్ ఇంజిన్, మాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్మిషన్లలో లభిస్తుంది. ఆటో ట్రాన్స్మిషన్ ధర రూ.4.48లక్షలుగా కంపెనీ పేర్కొంది. భారత్ నుంచి 45,300 క్విడ్ కార్లను ఎగుమతి చేసినట్లు పేర్కొంది.
రేనాల్ట్ ఇండియా సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ ‘‘రేనాల్ట్ క్విడ్‌ను భారత్ నుంచే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశాము. రేనాల్ట్ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ విషయం చెబుతోంది. భారత్‌లో మా వృద్ధికి క్విడ్ చాలా కీలకమైంది. ఇక్కడ దాదాపు 3.5లక్షల కుటుంబాలు క్విడ్‌ను వాడుతున్నాయి. కొత్తక్విడ్ విడుదలతో ఈ మార్పును కొనసాగిస్తాము’’ అని పేర్కొన్నారు.
ఇప్పటికే కస్టమర్ల కోసం రేనాల్ట్ ‘బై నౌ పే లేటర్’ అనే స్కీంను ప్రవేశపెట్టింది. దీనిలో కారును రుణంపై కొన్నతర్వాత మూడు నెలలకు తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. డీలర్‌షిప్‌లు, రేనాల్ట్ అధికారిక వెబ్సైట్ కానీ, లేదా మే రేనాల్ట్ యాప్ నుంచి కానీ దీనికోసం దరఖ్యాస్తు చేసుకోవచ్చు.