close

తాజా వార్తలు

మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఉపఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో భాజపా విజయం సాధించడంతో సీఎం యడియూరప్ప మంత్రివర్గ తుది విస్తరణపై దృష్టి సారించారు. ఈ మేరకు త్వరలో భాజపా అధిష్ఠానాన్ని కలవనున్నట్లు మంగళవారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే మూడు, నాలుగు రోజుల్లో దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలుస్తాను. వారి నిర్ణయాలు తీసుకున్న అనంతరం మేము మంత్రి వర్గాన్ని విస్తరిస్తాం. తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి నుంచి వచ్చిన నాయకులకు.. ఉపఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చాం. కాబట్టి వారిని మంత్రులను చేయడం మా బాధ్యత.. నేను కూడా అందుకు అంగీకరించాను. దీంతో వంద శాతం ఆ హామీని నెరవేర్చేలా కృషి చేస్తాం’ అన్నారు. 

కర్ణాటకలో 15 శాసనసభా స్థానాలకు డిసెంబర్‌ 5న ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికల్లో భాజపా 12 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అవకాశాలు పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో అటు కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఉపఎన్నికల్లో గెలిచిన వారికి, భాజపాలో ఉన్న పాత నాయకులకు మంత్రి వర్గంలో సమానంగా అవకాశం కల్పించడం అంటే అంత సులువైన విషయం కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాటు ఆయన మంత్రివర్గంలో సామాజిక వర్గాలను సైతం దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాల్సి ఉంటుంది. 

మరోవైపు ఉపఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేసిన వారిలో ఏహెచ్‌ విశ్వనాథ్‌(హునసూరు), ఎంబీటీ నాగరాజు(హోసకోటె)లు ఓడిపోయారు. భాజపా తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికి కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. దీనిపై యడియూరప్ప స్పందిస్తూ.. ఉపఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.