close

తాజా వార్తలు

Published : 26/11/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ ఎన్నికల వాయిదాకు సీఎం యత్నం

హైదరాబాద్‌: శాంతిభద్రతల సమస్య పేరుతో గ్రేటర్‌ ఎన్నికలను వాయిదా వేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఎంఐఎంతో కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 12 శాతం మైనార్టీ ఓటర్లు ఉన్న బిహార్‌లో మజ్లిస్‌ తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని.. 80 శాతం హిందువులు ఉన్న హైదరాబాద్‌లో ఎంతమంది భాజపా అభ్యర్థులు విజయం సాధించాలని ప్రశ్నించారు.  గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌, తెదేపాలకు ఇప్పటివరకు అవకాశమిచ్చారని.. భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ప్రజలకు సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. వరద బాధితులకు పంపిణీ చేస్తున్న నగదు సాయాన్ని తాను ఆపినట్లు తెరాస నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేయాలని తాను సవాల్‌ విసిరితే సీఎం కేసీఆర్‌ రాలేదన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా గెలిస్తే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద విజయోత్సవ సభ నిర్వహించుకుందామని కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్‌ చెప్పారు. 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌పై మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేసిండని ఎన్టీఆర్ ఘాట్ కూల్చుతావా ? పీవీ అయోధ్య విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని పీవీ ఘాట్ కూల్చుతావా ? రేపు ఉదయం ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులు ఆర్పిస్తాను. ఈ మహానాయకుల ఘాట్లకు రక్షణగా నేను ఉంటా అని రేపు ఘాట్ల వద్ద ప్రమాణం చేస్తా’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన