close

తాజా వార్తలు

Updated : 15/04/2020 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యాభర్తల గొడవలను తీరుస్తున్న శ్రీముఖి..!

ఆకట్టుకుంటున్న ‘బతుకు బలైపోయిన బండి’

హైదరాబాద్‌: భార్యాభర్తల మధ్య తలెత్తె గొడవలను బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖి తీరుస్తున్నారు. సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో వచ్చే సమస్యలను తీర్చడం కోసం బుల్లితెరలో పలు కార్యక్రమాలు ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి కార్యక్రమాలకు మనం ఎన్నో స్ఫూప్‌లు కూడా చూశాం. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమై.. తమ అభిమాన సిరీయల్స్‌, రియాల్టీ షోలు లేకపోవడంతో బోర్‌గా ఫీల్‌ అవుతున్న ఎందరో వీక్షకుల కోసం తాజాగా శ్రీముఖి ‘బతుకు బలైపోయిన బండి’ అనే ఫన్నీ స్ఫూప్‌ను రూపొందించింది. ఈ స్ఫూప్‌లో ‘జబర్దస్త్‌’ అవినాష్‌, బుల్లితెర వ్యాఖ్యాత విష్ణుప్రియ భార్యాభర్తలుగా కనిపించగా.. వారిద్దరి మధ్య సమస్యను తీర్చే పెద్దగా శ్రీముఖి మెప్పించారు.

కరోనా వైరస్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలను చాలా సరదాగా చెబుతూనే.. ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి తగాదాలు, సమస్యలు రావనే మంచి సందేశంతో రూపొందించిన ఈ వీడియోని శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్‌ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి రూపొందించారు. ఈ వీడియోను శ్రీముఖి తన సోషల్‌మీడియా ఖాతాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ‘బతుకు బలైపోయిన బండి’ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చాలా ఫన్నీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని