close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/02/2020 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫైనల్లో పేస్‌ జోడీ

బెంగళూరు: భారత దిగ్గజ డబుల్స్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్.. జొనాథన్‌ ఎల్రిచ్‌ (ఇజ్రాయెల్‌‌)- ఆండ్రీ వాసిలెవ్‌స్కీ (బెలారస్‌) జోడీపై 6-4, 3-6, 10-7తో విజయం సాధించాడు. మరో సెమీస్‌లో సాకేత్‌ మైనేని (భారత్‌)- మ్యాట్‌ రీడ్‌ (ఆసీస్‌)పై భారత ఆటగాళ్లు పురవ్‌ రాజా - రామ్‌కుమార్‌ రామనాథన్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరారు. శనివారం తుదిపోరు జరగనుంది.

రొటర్‌డామ్‌ సెమీస్‌లో బోపన్న జంట
రొటర్‌డామ్‌ ఓపెన్‌ ఏటీపీ 500 టోర్నీలో రోహన్‌ బోపన్న జంట సెమీస్‌కు చేరింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో బోపన్న-డెనిస్‌ షపోవలోవ్‌ (కెనాడా) జోడీ జూలియన్‌ రోజర్ (నెదర్లాండ్స్‌) ‌- హోరియా టెకావ్‌ (రొమేనియా)పై 6-2, 3-6, 10-7తో విజయం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాన్‌ పీర్స్‌ - మైకేల్‌ వీనస్‌పై 7-6, 6-7, 10-8తో గెలిచి క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.