close

తాజా వార్తలు

రాజధాని మహిళలపై దాడిని ఖండించిన భాజపా

అమరావతి: రాజధాని ప్రాంత మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాయికృష్ణ కోట చెప్పారు. సంక్రాంతి సమయంలో, పంట చేతికొచ్చేటప్పుడు గ్రామదేవతలకు పొంగళ్లు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని, ముడుపులు చెల్లించుకోవడం హిందూ సంప్రదాయమని ఆయన అన్నారు. ఈ చర్యలను హిందూ సంప్రదాయాల మీద ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి తన ఫ్యాక్షన్ భావాలతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారని అన్నారు. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులపై వెంటనే విచారణ జరిపి, వారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. హిందూ సాంప్రదాయాలు, మత విశ్వాసాల పట్ల ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలకు భాజపా పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.