
తాజా వార్తలు
భువి వచ్చే ఐపీఎల్‌కూ కష్టమే!
దిల్లీ: టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ వచ్చే ఐపీఎల్ ఆడటం కూడా కష్టమే. పిక్క కండరాల గాయంతో ఐపీఎల్-13 నుంచి అర్ధంతరంగా తప్పుకున్న అతను.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. భువి పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా నాలుగు నెలలకు పైగా పట్టొచ్చని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్‌లో ఐపీఎల్ ఆరంభం కావాల్సివుంది. గత రెండేళ్లుగా భువనేశ్వర్ గాయాలతో బాధపడుతున్నాడు. వెన్ను గాయం కారణంగా 2018లో ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన భువి.. నిరుడు తొడ కండరాల గాయంతో ప్రపంచకప్ కూడా పూర్తిగా ఆడలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో అతను హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నాడు.
ఇవీ చదవండి..
దాదాలా ధోనీ.. మహీలా కోహ్లీ చేయలేరు
‘మైండ్ గేమ్’ ఆడితే ఆడనివ్వండి: రహానె
Tags :