close

తాజా వార్తలు

Published : 20/11/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

WHOలో చేరతాం: బైడెన్‌

వాషింగ్టన్: అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్‌ ప్రకటించారు. అలాగే సంస్థలోని సభ్య దేశం చైనా నిబంధనల ప్రకారం నడుచుకుంటుందో లేదో తాను నిర్ధారించుకోవాలనుకుంటున్నాని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో భాగంగా చైనా గురించి బైడెన్ చేసిన ప్రకటనలనుద్దేశించి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చారు. కాగా, కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆ దేశం చెప్పినట్లు ఆరోగ్య సంస్థ నడుచుకుంటుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. 

‘చైనాను శిక్షించడం విషయం కాదు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆ దేశం అర్థం చేసుకొనేలా చూసుకోవడం ముఖ్యం. అది చాలా సాధారణమైన ప్రతిపాదన. మేము మొదటి రోజే సంస్థలో తిరిగి చేరబోతున్నాం. అలాగే దానిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందంలో కూడా తిరిగి చేరతాం. మనం, మిగతా ప్రపంచం కలిసే ఉన్నామనే విషయాన్ని చాటాలి’ అని గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్ స్పష్టం చేశారు. 

కాగా, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అమెరికా, చైనా సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్ ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలుగా మారాయి. కరోనాను ‘చైనా వైరస్’ అంటూ ట్రంప్ పలుమార్లు ఆదేశంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన