నేడే బిహార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌
close

తాజా వార్తలు

Published : 25/09/2020 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడే బిహార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌

దిల్లీ: నేడు బిహార్‌ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) విలేకరుల సమావేశం నిర్వహించనుంది. కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. 243 మంది సభ్యులున్న బిహార్‌ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబరు 29తో ముగియనుంది. 

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షితంగా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహా పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. వీలైనంత తక్కువ దశల్లో ఓటింగ్‌ చేపట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.  

ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, భాజపాతో కలిపిన ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈసారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఇక భాజపా, జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ సిద్ధమవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని