close

తాజా వార్తలు

Updated : 08/12/2020 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రం తగ్గకుంటే పెద్ద ఎత్తున ఆందోళన:తలసాని

హైదరాబాద్‌: రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేపట్టిన ప్రభుత్వాలు కనుమరుగయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి ఆధ్వర్యంలో నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలు సరికాదని అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతు పండించిన పంటను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు చలిని కూడా లెక్కచేయకుండా దిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

అనేక సంక్షేమ పథకాలతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తోందని మంత్రి అన్నారు. కొంత మంది కేంద్ర మంత్రులు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. వెంటనే నూతన వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మంత్రి హెచ్చరించారు.  
 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని