close

తాజా వార్తలు

Published : 04/12/2020 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేపు రహదారుల దిగ్బంధనం: భాజపా

విజయవాడ: వైకాపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఏపీ భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల దుస్థితిపై భాజపా ఆధ్వర్యంలో శనివారం రహదారుల దిగ్బంధనం కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు వైకాపా అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో మీడియాతో విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడారు. భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదని మండిపడ్డారు. 

‘‘ఈ ప్రభుత్వం మీద ప్రజలకే కాదు కాంట్రాక్టర్లకు కూడా నమ్మకం లేదు. ఏపీలో రూ.4వేల కోట్లకు టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు వీసీఐసీ ద్వారా నిర్వహణకు సొమ్ము ఇస్తే పక్కదారి పట్టించారు. పీఎంజీవై ద్వారా రూ.723కోట్లు ఇస్తే వాటిని కూడా దారి మళ్లించారు. సంబంధిత శాఖ నుంచి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ రాకపోవడంతో నిధులు ఆగిపోయాయి. బ్యాంకులు కూడా ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. ఎంఎస్‌ఎంఈ కింద సొమ్ములు ఆగిపోయాయి. పంచాయతీరాజ్‌లో రూ.900కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాజకీయ కారణాల కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఆర్థిక మంత్రి సొంత ఊళ్లో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. భాజపా శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి’’ అని విష్ణువర్ధన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన