ప్రమాదం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత:బండి సంజయ్‌
close

తాజా వార్తలు

Updated : 13/11/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రమాదం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత:బండి సంజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం హిందూ పండగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బానసంచాపై నిషేధం విధించడంపై బండి సంజయ్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బానసంచా నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం బలంగా తన వాదనలు వినిపించకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రతిసారీ హిందువుల పండగలను వివాదాస్పదం చేయడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. దీపావళి టపాసుల విక్రయాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మూసేయమనడంతో వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో చిరువ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధం విధించడంతో పెద్ద మొత్తంలో టపాసుల నిల్వలు పేరుకుపోయి ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాణసంచా నిషేధంతో నష్టపోతున్న చిరువ్యాపారులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. 192 దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో టపాసులు కాలిస్తే ఏర్పడని కాలుష్యం ఒక్కరోజు బాణసంచా కాలిస్తే వస్తుందా? అని నిలదీశారు. హిందువుల పండగలను ఆపడం 200 ఏళ్లు పాలించిన ఆంగ్లేయుల వల్లే కాలేదు.. అలాంటిది సీఎం కేసీఆర్ వల్ల ఏమవుతుందని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి..

తెలంగాణలో బాణసంచాపై నిషేధం

బాణసంచాను నిషేధించండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని