బిహార్‌లో పడవ ప్రమాదం.. 70 మంది గల్లంతు
close

తాజా వార్తలు

Updated : 05/11/2020 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిహార్‌లో పడవ ప్రమాదం.. 70 మంది గల్లంతు


ఇంటర్నెట్‌ డెస్క్‌ : బిహార్‌లోని భగల్‌పుర్‌ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మంది ప్రయాణిస్తున్నారు. బోటు... ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన స్థానికులు తక్షణమే స్పందించారు. పడవలో ఉన్న వారిలో 30 మందిని రక్షించగలిగారు. మిగతా వారి ఆచూకీ లభించలేదు. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. బోటు ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రజలు భారీసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.


 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని